రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ఉచితంగా, నగదు రహిత వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. మూడు, నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ (ఐఆర్‌టీఈ) నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయాన్ని తెలిపారు.