ఢిల్లీ తుగ్లక్ రోడ్ నెం.3లోని అధికారిక నివాసాన్ని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఖాళీ చేయనున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆయన దీనిని వినియోగించుకున్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు ఇక్కడ బంగ్లా కేటాయించారు.
హస్తినలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఇక్కడి నుంచే ఆయన నడిపారు. సీఎం అయ్యాక ఈ బంగ్లా ఆయన అధికారిక నివాసంగా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దానిని ప్రస్తుతం ఖాళీ చేస్తున్నారు.