ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని మండిపడ్డారు.
లిక్కర్ కేసులో సిసోడియా జైలులో ఉంటారు.. ఇదే కేసులో ఉన్న కవిత, వైసీపీ నేతలు బయట ఉంటారా? అని ప్రశ్నించారు. పర్యాటకశాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయన్నారు.