స్నేహితుడిని నమ్మించి హత్య చేసిన ఘటన అనంతరపురంలో జరిగింది. మున్నానగర్ కు చెందిన అలీ అనే యువకుడు గత నెల 27న ఇంట్లో బెంగుళూరు వెళ్లుతున్నానని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత అలీ ఫోన్ చేయకపోగా కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. స్నేహితుడే హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. కాగా ప్రస్తుతం నిందితుడు పోలీసుల ఆధీనంలో ఉన్నారు.