మరుగుదొడ్లకు తలుపులు లేవు. కరెంటు లేకపోతే నీళ్లు రావు. దీని గురించి ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదు. లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.ఇలాగైతే ఎలా చదువుకోగలం' అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం పి.ఎర్రగొండ గురుకుల కళాశాల విద్యార్థినులు వర్షంలో ఆందోళనకు దిగారు. సోమవారం కళాశాల ఎదుట ధర్నా చేశారు. 'వసతిగృహంలో 12 మరుగుదొడ్లు ఉండగా.. రెండింటికి మాత్రమే తలుపులున్నాయి. మిగతా వాటికి లేకపోవడంతో 5 నెలల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దీనిపై ప్రిన్సిపల్కి చెప్పినా పట్టించుకోవడం లేదు' అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.