మిచౌంగ్ తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమవుతోంది. భారీ వర్షానికి చెన్నై విమానాశ్రయం నీటమునిగింది. రన్‌వేపై నీరు నిలవడంతో ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు.
అయితే విమానాశ్రయాన్ని మూసివేయడంతో పెద్ద ఎత్తున విమానాలు రద్దు అయ్యాయి. ఈ క్రమంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా భారీగా సర్వీసులను రద్దు చేసింది. చెన్నై మీదుగా నడవాల్సిన 550 విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది.