తుఫాను మూలంగా చోడవరం మండలం భోగాపురం గ్రామంలో శారదా నది బ్రిడ్జిలను నీట మునిగిన వరి పంటల ను ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ మిచుంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, తగిన పరిహారాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు పాడైన వరి కంకులను, నీట మునిగిన పంటలను చూపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa