గృహ హింసపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే ఒక్క ఘటన ఆధారంగా, అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని స్పష్టం చేసింది.
ఫిర్యాదుదారైన మహిళ చేసిన ఆరోణలకూ బలమైన సాక్ష్యాలు ఉండాలని పేర్కొంది. ఓ వివాహిత తన భర్త, అతని సోదరి, మరో ఇద్దరు బంధువులపై ఐపీసీ సెక్షన్లు 498ఎ, 506, వరకట్న నిషేధ చట్టం కింద మోపిన నేరాభియోగాలను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.