జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పవన్‌తో పాటు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా విశాఖకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గన్న నోవటల్ హోటల్‌కు పవన్ బయలుదేరారు. జనసేన నాయకులు వీర మహిళలు ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఎస్ రాజా గ్రౌండ్లో జనసేన బహిరంగ సభలో జనసేనాని పాల్గొననున్నారు. సభళో ప్రజలను ఉద్దేశించి పవన్ మాట్లాడనున్నారు. ఈ సభలోనే జనసేన నేత సుందరపు విజయకుమార్ సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ సతీశ్‌కుమార్ పార్టీలో చేరనున్నారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో సతీష్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. సతీశ్‌కుమార్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.