ప్రొద్దుటూరు మండల పరిధిలోని నంగనూరుపల్లె గ్రామంలో నిర్మిస్తున్న రామలింగేశ్వరస్వామి కల్యాణ మండపం నిర్మాణానికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సతీమణి, కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రూ. 10లక్షలు విరాళాన్ని అందించారు. ఎంపీపీ శేఖర్ యాదవ్, సర్పంచ్ లక్ష్మీదేవి, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ యాలం తులశమ్మ, శంకరయ్య, ఎంపీటీసీ క్రిష్టిపాటి సంధ్య, తదితరులు పాల్గొన్నారు.