జగన్ సర్కార్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. త్వరాలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో తొలి మూడు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నుంచి ఓట్ ఆన్ అకౌంట్కు ఆమోదం పొందుతుంది.
జనవరి నెలాఖరుకు పూర్తి బడ్జెట్ సిద్ధం చేయాలని ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి తొలి వారంలో అసెంబ్లీకి సమర్పించే చాన్స్ ఉంది. ఈ మేరకు ఆర్థికశాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు.