మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరిగింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి గురువారం ఉదయం సుమారు 30,000 క్యూసెక్కుల మేర వరదనీరు వచ్చిచేరింది.
కాగా సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. దీంతో బ్యారేజీ వద్ద 30 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 22,200 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.