తెలంగాణay జనసేనకు వచ్చిన ఎన్నికల ఫలితాలే ఆ పార్టీకి ఏపీలో కూడా వస్తాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అదే విషయాన్ని విశాఖలో పవన్ నిర్వహించిన సభ మరోసారి రుజువు చేసిందన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ విశాఖ అన్ని రకాలుగా మేలు చేసిందని చెప్పే మీరు విశాఖ రాజధాని అంశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశాక పవన్‌కు మతి భ్రమించినట్లు కనిపిస్తోందన్నారు.