ఏలూరు జిల్లాలో పూళ్ళ గ్రామంలో దెబ్బ తిన్న పంట పొలాలను ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. నీట మునిగిన వరి చేలల్లో దిగి రైతులను పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు.
కాలువలను ఆధునీకరించి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదన్నారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని విమర్శించారు. నష్టపోయిన ప్రతి రైతుకి ఏకరానికి రూ.50 వేలు ప్రభుత్వం ఇవ్వాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.