తుపాన్ తీరం దాటిన మూడు రోజుల వరకూ దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు (శుక్రవారం) కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.