గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద ఈనెల 5వ తేదీన రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నారాయణ స్వామి అను యువకుడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఒకటో పట్టణ సీఐ రామసుబ్బయ్య తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో మస్తాన్ వలి అను యువకుడు ఆరోజే మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. వారిలో నారాయణ స్వామి మృతి చెందినట్లు సీఐ తెలిపారు.