రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు గ్యారెంటీతోనే సాధ్యమని టీడీపీ నాయకులు అన్నారు. హిందూపురం క్లస్టర్ ఇన్చార్జ్, మీడియా కోఆర్డినేటర్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో 37, 38 వార్డుల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు.