బుక్కరాయసముద్రం సి. ఐ నాగార్జునరెడ్డి వీఆర్ కు పంపుతూ శుక్రవారం జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. తనను సీఐ కొట్టినట్లు బొమ్మలాటపల్లికి చెందిన మహనందరెడ్డి చేసిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈనేపథ్యంలో జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించారు. సిఐను వీ. ఆర్ కు తీసుకొచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేసేందుకు జిల్లా అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డిని నియమించారు.