అనంతపురం జిల్లా పోలీసులు మానవత్వం చూపారు. సాటి మహిళా కానిస్టేబుల్ కిడ్నీలు ఫెయిల్ అయ్యి మార్పిడి కోసం ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించి కానిస్టేబుల్ నుండి జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వరకు ఆర్థిక తోడ్పాటు అందించారు. అనంతపురం ఎస్సీ, ఎస్టీ సెల్ మహిళా కానిస్టేబుల్ కుళ్లాయమ్మకు ఎస్పీ చెక్కు రూపంలో రూ. 7. 20 లక్షలు, నగదు రూపంలో రూ. 50 వేలు కలిపి రూ. 7. 70 లక్షలను శుక్రవారం అందజేశారు.