ఈ ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంటే, మరో చోట ఎండలు కొడుతుంటాయి. మరికొన్ని ప్రాతాల్లో అయితే విపరీతమైన చలి ఉంటుంది. అయితే ఈ మూడు ప్రాంతాల్లో ఎప్పుడొకప్పుడు వర్షం కురవడం సాధారణమే.
కానీ ప్రపంచంలో వర్షం పడని ప్రాంతం ఉందని మీకు తెలుసా.. అది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉన్నా ‘అల్-హుతైబ్’ గ్రామం. ఈ గ్రామం భూ ఉపరితలానికి 3,200 మీటర్ల ఎత్తులో ఉంది. మేఘాలు కమ్మని ఎత్తులో ఉండటంతో ఈ గ్రామంలో వర్షం పడదు.