స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను జనవరి 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని కోరారు. ఒకవేళ వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని వాదించారు. కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామన్న సాల్వే.. 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.