టీటీడీ నిధుల మళ్లింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. టీటీడీ నిధులను తిరుపతి రోడ్లు, పారిశుద్ధ్యానికి కేటాయించడం చట్టవిరుద్ధమని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఎండోమెంట్ చట్టం ప్రకారం నిధులు మళ్లింపు చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. టీటీడీ అభివృద్ధికే నిధులను వినియోగించాలని పిటిషన్ తరపు న్యాయవ్యాది బాలాజీ అన్నారు.