విశాఖలో మత్స్యకారులను ఆదుకోవడంలో YCP ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. హార్బర్ వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. 'విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరం. వారికి ఎప్పుడూ అండగా నిలబడేది టీడీపీనే. బోట్లు కాలిపోయిన వారికి రూ. లక్ష, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ. 50వేలు ఇస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనలను ప్రజలు ఆదరించాలి' అని అన్నారు.