విశాఖలో మందుబాబులకు కిక్ దిగేలా తీర్పు ఇచ్చింది కోర్టు. మద్యం మత్తులో వాహనాలు నడువుతున్న 121 మందిని పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఆ 121 మంది మందుబాబులకు భీమిలి కోర్ట్ న్యాయమూర్తి వేయి రూపాయల జరిమానాతో పాటూ ఎవరూ ఊహించిన విధంగా భీమిలిలో ఉన్న కోకొనట్ పార్క్, సెయింట్ ఆన్స్ స్కూల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు ఇకనైనా తెలుసుకొని వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించడం మానేస్తారనే ఉద్దేశంతో ఇటువంటి తీర్పు ఇచ్చారని పలువురు అనుకున్నారు. ఆదేశాలను దిక్కరిస్తే జైలుకు పంపాలని ఉత్తర్వులు. విశాఖలో పోలీసులు డంక్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. కొద్దిరోజులుగా ఈ డ్రైవ్‌లను ముమ్మరం చేశారు.. గతంలో మద్యం మత్తులో కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. అందుకే ఈ డంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టులు కూడా తీవ్రతను బట్టి జరిమానాలు, జైలు శిక్షల్ని కూడా విధిస్తోంది. అలాగే జరిమానాలతో పాటుగా పరిసరాలను శుభ్రం చేయడం.. రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనదారులకు అవగాహన కల్పించేలా ప్లకార్డులు ప్రదర్శించాలనే శిక్షల్ని కూడా అమలు చేస్తున్నారు.