ఒకే రోజు నాలుగు రాష్ట్రాల్లో భూమి కంపించడం కలకలం రేపింది. శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలోనే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకతోపాటు గుజరాత్, మేఘాలయల్లోనూ భూప్రకంపనలను గుర్తించినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.
కర్ణాటక విజయపుర జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.0 తీవ్రతతో, తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. మేఘాలయలో 3.8 తీవ్రత, గుజరాత్‌లో 3.9 తీవ్రతతో భూమి కంపించింది.