తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం మాచవరం మండలం కొత్త గణేష్ పాడు గ్రామంలో వరి పంటలను ఆయన పరిశీలించారు.
తుఫాను ఈదురు గాలుల దాటికి వరిపంట పూర్తిస్థాయిలో నేలకొరిగాయి. రైతులకు సరిగ్గా కోతకు వచ్చే సమయంలో ఇలా జరగటం బాధాకరమని యరపతినేని అన్నారు. అధికారులు స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.