బుచ్చయ్యపేట మండలం వడ్డాది లో ఈనెల 12 న మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న సామాజిక సాధికార బస్సుయాత్ర భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ ఆదివారం కోరారు. చోడవరం నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో ప్రచార రథం ద్వారా ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్రజలు తరలిరావాలని కోరారు.