టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. "విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచింది. రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం. విపత్తుల సమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటీ? ఎవరి హయాంలో రైతులకు మేలు జరిగిందో బహిరంగ చర్చకు నేను సిద్ధం.. దమ్ముంటే చంద్రబాబు నాతో చర్చకు రావాలి. తేదీ, టైమ్, ప్లేస్ చెబితే వస్తాను." అని ఆయన వ్యాఖ్యానించారు.