దేశ రాజధాని ఢిల్లీలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఢిల్లీ వాసులు వాట్సాప్లో బస్సు టిక్కెట్లను పొందనున్నారు.
వాట్సాప్ ఆధారిత బస్ టికెటింగ్ విధానాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ విధానాన్ని ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఇదే తరహాలో ఇప్పుడు బస్సుల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.