రైతులు రక్తం చిందించి పండించిన పంటలన్నీ వరదలో కొట్టుకుపోయి, వరద నీటిలో మునిగిపోయి రైతు కన్నీరు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి రెడ్ కార్పెట్ వేసుకుని వెళ్లి రావడం సిగ్గు చేటని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ చదలవాడ అరవింద బాబు సోమవారం ధ్వజమెత్తారు. తక్షణమే వరద బాధితులందరికీ పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంట నష్ట పరిహారం పై తక్షణమే సమాచారం సేకరించాలన్నారు.