మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జరుగుమల్లి ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి మత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అనేది గుర్తుంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు.