ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో గతంలో ఇంటి పట్టాలు ఇచ్చిన వారికి ఇంటి స్థలాలు తక్షణమే చూపించాలని కంభం ఏడవ అవార్డు మెంబర్ షేక్ అత్తర్ హుస్సేన్ దాదా ఎమ్మార్వో కు సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. కంభం గ్రామపంచాయతీలో 250 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారని ఇంతవరకు వారికి స్థలం కేటాయించలేదని ఎమ్మార్వో కు ఏడవ వార్డు మెంబరు విన్నవించారు. తక్షణమే పట్టాలు ఇచ్చిన వారికి ఇంటి స్థలం చూపించాలని ఎమ్మార్వో ను కోరారు.