కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు రెండు సార్లు గర్భం వచ్చింది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ మహిళ 2015లో స్టెరిలైజేషన్ సర్జరీ చేయించుకుంది.
అయినా ఆమె గర్భం దాల్చడంతో 2018లో జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో ఆరోగ్య కేంద్రంలో నాటి సివిల్ సర్జన్ రూ.6,000 మొత్తాన్ని బాధిత దంపతులకు పరిహారంగా అందించారు. అయితే తాజాగా ఆమె మళ్లీ గర్భం దాల్చింది.