తాడికొండ నియోజకవర్గ వైసిపి ఇంఛార్జిగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరితను నియమిస్తూ వైసిపి కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు ఈమె ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటివరకు తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా కత్తెర సురేష్ కుమార్ పనిచేశారు. కత్తెర సురేష్‌కు అధిష్టానం ఎక్కడైనా అవకాశం కల్పిస్తుందా లేదా అనేది నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.