గుడివాడలో టీడీపీ జెండా ఎగరేస్తామంటున్నారు టీడీపీ నేతలు. గుడివాడ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరగడం వేయడం ఖాయమంటున్నారు. గుడ్లవల్లేరులో టీడీపీ ముఖ్య నేతల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. చంద్రబాబు గుడివాడ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర. రావి వెంకటేశ్వరరావు కష్టకాలంలో పార్టీకి ఎంత చేశారో అందరికీ తెలుసు. ఆయన సామర్ధ్యాన్ని ఏస్థాయిలోనూ తక్కువ చేయడంలేదన్నారు.. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని బలంగా ఢీ కొట్లాలన్నారు.
గుడివాడలో ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ గెలవాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా గుడివాడ ఇంఛార్జ్‌ఋగా వెనిగండ్ల రామును నియమించామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి లిస్టులోనే రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని రవీంద్ర చెప్పారు. ఇలానే ప్రతీసారీ రావిని పార్టీ మోసం చేస్తూనే వచ్చిందని రవీంద్రను కార్యకర్తలు నిలదీయగా.. రవీంద్ర స్పందిస్తూ స్టాంప్ పేపర్‌పై రాసిస్తాను అన్నారు. రావికి మరోసారి అన్యాయం జరిగితే రాజీనామా చేసి రావికి అండగా నిలుస్థానని స్పష్టమైన హామీ ఇచ్చారు.
వందల కోట్లు ప్రజా ధనాన్ని దిగమింగిన రాక్షసుడిని అంతమొందించి గుడివాడలో టీడీపీ జెండా ఎగురవేద్దామన్నారు రావి వెంకటేశ్వరరావు. దుష్ప్రచారాలు చేయడమే నానికి అలవాటు.. అతని ఎత్తుగడలను తిప్పికొడదాం.. అని వెనిగండ్ల రాము అన్నారు. రావికి కార్యకర్తల పట్ల ఉన్న ప్రేమ, ఆయన పై కార్యకర్తలకు ఉన్న అభిమానాన్ని చూశానని.. అదే ప్రేను తనకూ ఉందని.. రాబోయే రోజుల్లో చూస్తారని అన్నారు. రావి త్యాగానికి రుణపడి ఉంటానన్నారు.
గుడ్లవల్లేరు పార్టీ ముఖ్య నేతలతో రవీంద్ర, రావి, రాములు సమావేశమయ్యారు. ఆ సమయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు కొసరాజు బాపయ్య చౌదరిని చిన్నచూపు చూస్తే సహించబోమని తామంతా రాజీనామాలు చేస్తామని రాజీనామా లేఖలను రవీంద్రబకు ఇవ్వబోయారు. బాపయ్య చౌదరి వారిని వారించి తనను ఎవ్వరూ చిన్న చూపు చూడలేదని.. అందరం పార్టీ కోసం పనిచేద్దామన్నారు. పార్టీ గెలుపే లక్ష్యం అని నాయకులకు సర్ధి చెప్పారు. గుడ్లవల్లేరు మండలంలో బాపయ్య చౌదరి మాటే శిరోధార్యమని స్పష్టం చేశారు.
ఇటీవలే వెనిగండ్ల రామును గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా నియమించారు. మొన్నటి వరకు రావి వెంకటేశ్వరరావు పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. ఆయన స్థానంలో రాముకు అవకాశం దక్కింది. దీంతో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రావి మాత్రం పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెబుతున్నారు. వెనిగండ్ల రాముతో కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు.