ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న నకిలీ ఓట్లను తొలగించాలని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతి కుమార్ ఆర్డీవో విశ్వేశ్వర రావును మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గంతో పాటు 2, 3 చోట్ల ఓట్లు కలిగిన వారు వేల సంఖ్యలో ఉన్నారని, అటువంటి ఓట్లను గుర్తించి తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఆర్డీవో స్పందించి బిఎల్వోలతో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు.