మాజీ మంత్రి కొడాలి నాని తన మంత్రి పదవి నుంచి తీసేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చట్ట సభల్లో ప్రతి కులానికి ప్రాతినిధ్యం ఉండాలనేదే సీఎం జగన్ ధ్యేయమన్నారు.
తాను సరిగా పని చేయట్లేదని మంత్రి పదవి నుంచి తీసేశారా?.. ఓసీని కాబట్టి తీసేశారని అన్నారు. తనను, పేర్ని నానిని తీసేసి బీసీ అయిన జోగి రమేశ్ కు అవకాశం ఇచ్చారన్నారు. ఇక వైసీపీ వ్యూహంలో భాగంగానే సిట్టింగులను మారుస్తున్నామన్నారు.