18 ఏళ్ల యువతిని గుర్తుతెలియని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. జలంధర్‌లోని బస్తీ బవాఖెల్దాకు చెందిన ఓ యువతి పదో తరగతి చదువుతోంది.
అయితే హఠాత్తుగా మంగళవారం నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఖాళీ స్థలంలో యువతి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.