సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. రేపల్లె ప్రాజెక్టు కార్యాలయం వద్ద బుధవారం అంగన్వాడీల శిబిరాన్ని నాయకులు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు.
అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం నెరవేర్చాలని టిడిపి నాయకుడు అనగాని శివప్రసాద్, జనసేన పట్టణ అధ్యక్షుడు మహేష్, ఆదర్శ వేదిక కన్వీనర్ వై కిషోర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.