తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా పర్చూరు నియోజకవర్గంలో అపార పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పొగాకు తుడిచిపెట్టుకుపోయాయి. పర్చూరు మండలంలో అత్యధికంగా 6684 హెక్టార్లలోనూ, కారంచేడు మండలంలో 5038 హెక్టార్లలోనూ, యద్దనపూడి మండలంలో 1719 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు బుధవారం వంట నష్టం అంచనాల కోసం జిల్లాకు వచ్చిన కేంద్ర బృందానికి జె. సి శ్రీధర్ నివేదిక సమర్పించారు.