జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్గా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ నియమితులయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బన్నీ వాస్కు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీకి ప్రచార విభాగం చాలా ముఖ్యమని, ప్రచార విభాగాన్ని సమన్వయంతో నడిపించాలని బన్నీ వాస్ కు సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలు రూపొందించాలన్నారు. పార్టీ ఎదుగుదలకు మరింత కృషి చేయాలని పవన్ కల్యాణ్ అన్నారు.