తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. సొత్తూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వెంబకోట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa