ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. దీంతో మాజీ సీఎం కమల్నాథ్ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారంటూ తెగ వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా ఛింద్వారాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కమల్నాథ్ మాట్లాడుతూ.. ‘నేను రిటైర్ కాను.. నా తుదిశ్వాస వరకు ఛింద్వారా ప్రజలకు సేవ చేస్త’ అని దీనిపై క్లారిటీ ఇచ్చారు.