దేశవ్యాప్తంగా ఈ ఏడాది 7 ప్రముఖ పట్టణాల్లోని ఇళ్ల అమ్మకాల్లో 38 శాతం వృద్ధి నమోదవుతుందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ అంచనా వేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకు జరిగిన అమ్మకాలు.. గతేడాది (3.26 లక్షల కోట్ల)తో పోలిస్తే 7 శాతం వృద్ధి సాధించి రూ.3,48,776 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఈ ఏడాది మొత్తం విలువ రూ.4.5 లక్షల కోట్ల మేర ఉంటుందని చెప్పింది. పండుగ సీజన్‌లో ఇళ్ల అమ్మకాలు జోరందుకున్నట్లు తెలిపింది.