దేశవ్యాప్తంగా 10 లక్షల టన్నుల కందులను సేకరించాలని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య నిర్ణయించింది. ఇందులో ఏపీలోని ఆర్బికెల నుంచే 50 వేల టన్నులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీంతో ఆర్బికె అధికారులు వచ్చే వారం నుంచే రైతుల నుంచి కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎంఎస్పికి మించి క్వింటా రూ.9,500-10,500 ఉండగా, అదే ధరకు ప్రభుత్వం సేకరించనుంది.