విజయనగరం జిల్లా, కురుపాం శోభలతాదేవి కాలనీలో నివాసం ఉంటున్న ఎస్.కోట సబ్ ట్రెజరీ ఉద్యోగి గూడేపు రాజశే ఖర్(33) గురువారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డారు. భార్య సౌందర్య కుటుంబీకులకు స మాచారం ఇవ్వడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కురుపాం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టుం నిమి త్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య భర్తల మధ్య తర చూ గొడవల కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు.