సీఎం జగన్ చేస్తున్న రాజకీయం చూసి చంద్రబాబుకు షాక్ తగిలిందని మాజీమంత్రి, బందరు శాసనసభ్యుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబుకు కొత్తగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. గోతికాడ నక్కలా రెండుకళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయజీవితంలో, 13 ఏళ్ల ముఖ్యమంత్రిగా పాలనలో చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 175 సీట్లలో విజయం సాధించాలనే దిశగా సీఎం వైయస్ జగన్ పనిచేస్తుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలను బదిలీ చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించటం విడ్డూరంగా ఉందన్నారు. మరి చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లాడు, కోడెల శివప్రసాద్‌ను నరసరావుపేట నుంచి సత్తెనపల్లెకు ఎందుకు పంపారో చెప్పాలని డిమాండ్ చేశారు. నువ్వు చేస్తే రాజ్యాంగబద్ధం వేరొకరు చేస్తే తప్పు అని మాట్లాడటమా అని చంద్రబాబును ప్రశ్నించారు. మరి వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నావని నిలదీశారు. అగ్రవర్ణానికి చెందిన ఎంపీ రాజును ఎలా అక్కున చేర్చుకున్నావో చెప్పాలన్నారు.