ఆంధ్రప్రదేశ్ సహా తూర్పు తీర రాష్ట్రాల్లో మత్స్య సంపద నిల్వలు సమృద్ధిగా (97శాతం) ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) - సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) ప్రచురించిన మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆఫ్ ఇండియా-2022 నివేదికలో పేర్కొన్నట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్దక, డైరీయింగ్ శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆ నివేదికలో ప్రచురించిన విధంగా దేశంలో సమగ్ర సముద్ర చేపల నిల్వల అంచనా ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మూల్యాంకణం చేసిన 135 ఫిష్ స్టాక్ ప్రాంతాల్లో 91.1% మంచి నాణ్యత, పరిమాణంలోగల చేపల లభ్యత ఉన్నట్లు తెలిపారు. మెరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ నివేదిక ప్రకారం దేశంలో సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, లక్షద్వీప్ సముద్ర ప్రాంతాల్లో మెరైన్ ఫిష్ స్టాక్ స్థితిని అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. సౌత్ ఈస్ట్ తీర ప్రాంతంలో 39 చేపల నిల్వల ప్రాంతాల్లో 97 శాతం లభ్యత ఉన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నార్త్ వెస్ట్ తీర ప్రాంతంలో 37 పిష్ స్టాక్స్ లో 83.8%, సౌత్ వెస్ట్ తీర ప్రాంతంలో 41 ఫిష్ స్టాక్స్ లో 92.7%, లక్షద్వీప్ లో 2 ఫిష్ స్టాక్స్ లో 100శాతం, నార్త్ వెస్ట్ లో 37 ఫిష్ స్టాక్స్ లో 87.5%, వెరసి దేశంలో 135 ఫిష్ స్టాక్స్ లో 91.1 శాతం చేపల లభ్యత ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి వంటి సౌత్ ఈస్ట్ కోస్టల్ రాష్ట్రాల్లో మదింపు కోసం ఫిష్ ల్యాండింగ్స్లో లభ్యమవుతున్న చేపల జాతులు, వాటి పరిమాణం, ఎంత తరచుగా లభ్యమవుతున్నాయన్న వివరాలు సేకరించినట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుతం విస్తరించిన ఫిషరీష్ మెనేజ్మెంట్ పాలనా వ్యవస్థ కింద ఆంధ్రప్రదేశ్ తో సహా జాతీయ, ప్రాంతీయ ప్రాముఖ్యత దృష్ట్యా సముద్ర చేపల నిల్వల స్థితి అంచనా వేయడం, సారాశంతో కూడిన పూర్తి సమాచారం అందిండమే నివేదిక ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. మేనేజ్మెంట్ యూనిట్స్ నిర్వచించిన ప్రకారం చేపల పంట స్థాయి, సంమృద్ది ఆధారంగా బయోలాజికల్ స్థిరత్వం కోసం ఫిష్ స్టాక్స్ అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అయితే మొరైన్ ఫిష్ స్టాక్ స్టేటస్ ఆప్ ఇండియా -2022 స్టడీలో భాగంగా రాష్ట్రాల వారీగా ఫిష్ స్టాక్స్ అంచనా వేయలేదని మంత్రి తెలిపారు. 135 ఫిష్ స్టాక్స్ లో 49 ఫిన్ చేపలు, 21 షెల్ చేపలు వెరసి 70 చేప జాతులకు సంబందించి వేసిన అంచనాలో 91.1శాతం లభ్యత ఉన్నట్లు మంత్రి తెలిపారు.