జనసేన పార్టీ నేత పవన్కళ్యాణ్ వైయస్ఆర్సీపీని ఓడించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాననటం హాస్యాస్పదంగా ఉందని పేర్ని నాని వాపోయారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి వైపు మాట్లాడకుండా కేవలం చంద్రబాబు రాజకీయ లబ్దికోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లు దాటినా ఆత్మస్థైర్యం లేకుండా పనిచేస్తున్నారన్నారు. టెంట్హౌస్లాగా అద్దెకు ఇచ్చే పార్టీని నడుపుతున్నారని, తన పార్టీని చంద్రబాబుకు లాంగ్లీజ్కు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో జీవనం సాగిస్తూ ఆంధ్రాలో రాజకీయం చేయటం చంద్రబాబుకు, పవన్కళ్యాణ్కే చెల్లిందని విమర్శించారు.