గంజాయి, డ్రగ్స్, దొంగసారా కాసేవాళ్లను పట్టుకోవడం చేతగాని జగన్ ప్రభుత్వం రైతులు, వ్యాపారులను ఇబ్బందులు పెట్టడం దారుణమని టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. విశాఖ ఏజన్సీలో ప్రభుత్వ పెద్దల అండతోనే గంజాయి సాగు జోరుగా సాగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. టీడీపీ - జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్లం తయారీదారులు, వ్యాపారులపై ఆంక్షలను తొలగించి స్వేచ్చగా విక్రయాలకు అవకాశం కల్పిస్తామన్నారు. చెరకు రైతులకు ప్రభుత్వం తరపున సహకారం అందించి ఆదుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa